మట్టిమనిషి

updated: March 10, 2018 17:47 IST
మట్టిమనిషి

కాలం కన్న బిడ్డ “రైతు”

ప్రతీ పిడికెడు మట్టీ రైతు గుండె చప్పుడు.!

నోటికి చేతికి వున్నదూరం

నింగికీ నేలకి వున్నదూరం కంటే ఎక్కువ.

ఆకలికి అడ్డుకట్టవేసే వంతెనే “రైతు”.!

అందరి ఆకలీ తీర్చి తనుమాత్రం పస్తులతో దోస్తీ చేసే అమ్మతనమున్నోడు.!

అందరి సంతోషమే తన సంతోషంగా కన్నీళ్ళు తాగి బతికే వెర్రిబాగులోడు.!!

 

సహజంగా ఐదువేళ్ళు వుంటే తనకిమాత్రం ఆరువేళ్ళు వుంటాయ్ నాగలితో కలిపి.!

ఒక మెతుకు పుట్టించడానికి రైతుపడే కష్టం

బిడ్డని పుట్టించడానికి తల్లిపడే పురిటినొప్పులకి ఏమాత్రం తీసిపోదు.!

మనుషులందరూ భూమ్మీద తిరుగుతారంతే.!

రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు.!! 

ఎవరెంత ఎత్తుకెదిగినా

నేలమీదే ఆధారపడి వుండాలి.!

నేల మాత్రం రైతుమీదే ఆధారపడి వుంటుంది.!

రాజెప్పుడూ రైతు అవ్వలేడు

కానీ రైతెప్పుడూ రాజే.!

--సురేష్ భానిసెట్టి

comments