తెల్లవాడికి స్వాతంత్ర్యం మనమిచ్చాం: -సిరాశ్రీ

updated: August 15, 2018 18:27 IST
తెల్లవాడికి స్వాతంత్ర్యం మనమిచ్చాం: -సిరాశ్రీ

తెల్లవాడికి స్వాతంత్ర్యం మనమిచ్చాం:

వాడి భాష లాక్కున్నాం
వాడి వేషం లాక్కున్నాం
వాడి విభజించి పాలించే నేర్పు లాక్కున్నాం
వాడి సాంకేతికత లాక్కున్నాం;

200 ఏళ్లు వాడిని నెత్తిన పెట్టుకుని 
వాడిని రాజులా భ్రమింపజేసి
వాడి నైజం లాక్కున్నాం;

ఇంకా ఉంటే
వాడి సర్వస్వం జుర్రేసేవాళ్లం;

మన దగ్గరనుంచి వాడు పట్టుకెళ్లింది చూపించమంటే 
వాడి దగ్గర ఏదీ లేదు
వాడి మ్యూజియంలో రాళ్లు, రప్పలు తప్ప;

కానీ మన దగ్గర
తెల్లవాడి శక్తులన్నీ ఉన్నాయి;

తెల్లవాడిని తెల్లమొహం వేయించి 
"ఇక పోండిరా" అని 
మనమిచ్చాం 
వాడికి స్వాతంత్ర్యం.

మన దేశాన్ని ఎవడు దోచుకోవాలని వచ్చినా 
చివరకు వాడే అర్పించుకుని వెళ్లాలి
మేరా భారత్ మహాన్!
ఖబడ్దార్!!


Tags: sirasri, telugu poem, kavita, independence day

comments